ప్రముఖ ర్యాపర్ ధర్మేష్ పార్మర్ కన్నుమూత (dharmesh parmar)
Dharmesh Parmar: ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. కేవలం 24 ఏళ్ళ వయసులోనే ఓ ప్రముఖ ర్యాపర్ కన్నుమూసాడు. ఇది తెలిసి బాలీవుడ్ అంతా షాక్ అయిపోయింది.
ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. కేవలం 24 ఏళ్ళ వయసులోనే ఓ ప్రముఖ ర్యాపర్ కన్నుమూసాడు. ఇది తెలిసి బాలీవుడ్ అంతా షాక్ అయిపోయింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమా ‘గల్లీ బాయ్’లో ర్యాప్ పాడిన ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ మార్చ్ 21న హఠాన్మరణం చెందాడు. ఈయన వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అతడు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులు ధర్మేంద్రను తలుచుకుని కన్నీరు కారుస్తున్నారు.
గుండె సంబంధిత కారణాలతోనే ధర్మేశ్ పార్మర్ ప్రాణాలు విడిచాడు. ముంబైలోనే అతడి అంత్యక్రియలను పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఈ విషయాన్ని అతడు పార్ట్నర్గా ఉన్న యూ ట్యూబ్ చానెల్ ‘స్వదేశీ’ ఖరారు చేసింది. స్వదేశీ కోసం అతడు పాడిన చివరి సాంగ్ కూడా పోస్ట్ చేసారు వాళ్ళు. ఇదిలా ఉంటే సినిమాల్లోనూ ధర్మేశ్ పార్మర్కు ప్రవేశం ఉంది. గల్లీబాయ్ సినిమాలోని ‘ఇండియా 91’ పాటను టాడ్ ఫాడ్ పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్నూ సృష్టించాడు. అది చాలా ఫేమస్ అవ్వడమే కాకుండా.. ధర్మేశ్కు మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది.
బాలీవుడ్లో మరికొన్ని సినిమాలకు కూడా ర్యాప్ పాడే ఛాన్సులు తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందడుగు వేస్తున్న సమయంలోనే టాడ్ ఫాడ్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘గల్లీబాయ్’ డైరెక్టర్ జోయా అక్తర్, హీరోలు రణ్వీర్ సింగ్, సిద్ధార్థ్ చతుర్వేది సంతాపం తెలిపారు.
24 ఏళ్ళ చిన్న వయసులోనే వెళ్లిపోతావని ఊహించలేదు.. నిన్ను కలిసినందుకు చాలా గర్వపడుతున్నా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. బాంటాయ్ అంటూ జోయా ట్వీట్ చేసింది. టాడ్ ఫాడ్ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన రణ్వీర్ సింగ్.. అతడి మరణంపై విచారం వ్యక్తం చేసాడు. చివరి సారిగా టాడ్ ఫాడ్తో తాను చేసిన చాటింగ్ వివరాలను సిద్ధార్థ్ చతుర్వేది ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఈయన మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.