Rajinikanth: ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న అభిమానుల ఆశలను నీరు కారుస్తూ సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేనని రజనీ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల విఙ్ఞప్తి మేరకు సూపర్‌స్టార్ ఈ డెసిషన్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అయినా.. రజనీ ఆరోగ్యం దృష్ట్యా చాలా మంది దీన్ని స్వాగతించారు. ఈ సమయంలో సూపర్‌స్టార్ తీసుకున్న నిర్ణయం మంచిదని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి రజనీ నిర్ణయంపై ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ నటి రజనీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇది ఊహించినదే. ఇది నాకు నేను అనుకున్నా. అంతేకాదు చాలా మంది చాలా సార్లు అనుకున్నారు. ఈ విషయం ఆయన ముందే చెప్పి ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది బాధ తొలిగిపోయేది. మొత్తానికి ఆయన ఇప్పుడు చెప్పేశారు. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అని ట్వీట్ చేశారు.
అంతటితో ఆగకుండా కోట్లు పోగొట్టుకోవడం కంటే.. మెదడు పడే ఆవేదన చాలా పెద్దది. భయపడుతూ ఉండేవారు లేదంటే వారి వలన బాధపడేవారు ఉంటే యుద్ధానికి వెళ్లకపోవడమే మంచిది. రజనీకాంత్ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. మంచి ఆరోగ్యంతో ఆయన మరిన్ని సంవత్సరాల పాటు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని కామెంట్ పెట్టారు.
எதிர்பார்த்ததுதான்.
எத்தனையோ முறை நான் உட்பட பலரும் சொன்னதுதான். எப்பவோ சொல்லியிருந்தால் ஏராளமானவர்களுக்கு வலியை தவிர்த்திருக்கலாம். வருடங்களை மிச்சப்படுத்தியிருக்கலாம்.
இப்பவாச்சும் சொன்னாரே. இப்ப இல்லை, எப்பவுமே இல்லை ! #rajinipoliticalNOentry
— Kasturi Shankar (@KasthuriShankar) December 29, 2020
కాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ వెల్లడించారు. జనవరిలో పార్టీని ప్రకటిస్తానని.. దానికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని రజనీ ఆ మధ్యన వెల్లడించారు. ఆ సమయంలో తాను ఒప్పుకున్న షూటింగ్‌లను పూర్తి చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఈ లోపే ఆయన అనారోగ్యం బారిన పడటంతో అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అభిమానుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth