పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌కు సూపర్ స్టార్ కృష్ణ సవాల్

గ్రీన్ ఛాలెంజ్‌ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ని అభినందించారు కృష్ణ. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి.. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: November 19, 2019, 9:00 PM IST
పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌కు సూపర్ స్టార్ కృష్ణ సవాల్
మొక్కలు నాటిన కృష్ణ
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్, కవిత, వరుణ్ తేజ్, సాయిపల్లవి, పీవీ సింధు, యాంకర్ సుమ, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కృష్ణతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ని అభినందించారు కృష్ణ. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి.. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు సూపర్ స్టార్. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, విక్టరీ వెంకటేష్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు కృష్ణ. కాగా, తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...