సమంతకు సాయి పల్లవి సవాల్.. వరుణ్‌ తేజ్‌కు థ్యాంక్స్

లి నాణ్యత ప్రమాదకర స్థాయికి క్షీణించిందని.. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కోరింది సాయిపల్లవి.

news18-telugu
Updated: October 10, 2019, 2:35 PM IST
సమంతకు సాయి పల్లవి సవాల్.. వరుణ్‌ తేజ్‌కు థ్యాంక్స్
సమంత, సాయిపల్లవి
news18-telugu
Updated: October 10, 2019, 2:35 PM IST
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్న వేళ సెలబ్రిటీల గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్, కవిత, వరుణ్ తేజ్ మొక్కలు నాటారు. ఇటీవలే మొక్కలు నాటిన గద్దల కొండ గణేష్... సాయిపల్లవి, తమన్నాను నామినేట్ చేశాడు. వరుణ్ తేజ్ ఛాలెంజ్ స్వీకరించిన ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురువారం తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి క్షీణించిందని.. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కోరింది సాయిపల్లవి. ప్రకృతి నుంచి ఎక్కువగా తీసుకుంటూ.. ప్రకృతికి మాత్రం తక్కువగా ఇస్తున్నామని తెలిపంది. ఇక ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ బ్యూటీలు సమంత అక్కినేని, రానా దగ్గుబాటని నామినేట్ చేశారు. ఇద్దరూ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించింది. ఇక తనకు ఛాలెంజ్ విసిరిన గద్దలకొండ గణేష్‌కు ధన్యవాదాలు తెలిపింది సాయిపల్లవి. కాగా, తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...