సాయి పల్లవికి వరుణ్ తేజ్ సవాల్.. తమన్నాకు సైతం..

కొంచెం బిజీగా ఉన్నప్పటికీ.. మంచి పని కోసం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనంటూ మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు వరుణ్ తేజ్.

news18-telugu
Updated: October 5, 2019, 7:15 PM IST
సాయి పల్లవికి వరుణ్ తేజ్ సవాల్.. తమన్నాకు సైతం..
సాయి పల్లవి, వరుణ్, తమన్నా
news18-telugu
Updated: October 5, 2019, 7:15 PM IST
తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. అనంతరం అక్కినేని అఖిల్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని నామినేట్ చేయడంతో గద్దలకొండ గణేష్ శనివారం మొక్కలు నాటాడు. కొంచెం బిజీగా ఉన్నప్పటికీ.. మంచి పని కోసం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనంటూ మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశాడు ఈ గద్దల కొండ గణేష్.
Loading...
తన వంతుగా మొక్కలు నాటిన వరుణ్ తేజ్...గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ బ్యూటీలు సాయిపల్లవి, తమన్నాను నామినేట్ చేశారు. ఇద్దరూ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించాడు. ఇక తనకు ఛాలెంజ్ విసిరిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపాడు వరుణ్. కాగా, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను సెప్టెంబరు 5న ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.
First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...