అల్లరి నరేష్‌కు బిగ్ బాస్ వరుణ్ సందేశ్ సవాల్

బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

news18-telugu
Updated: November 24, 2019, 8:23 PM IST
అల్లరి నరేష్‌కు బిగ్ బాస్ వరుణ్ సందేశ్ సవాల్
అల్లరి నరేష్, వరుణ్ సందేశ్
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్, కవిత, వరుణ్ తేజ్, సాయిపల్లవి, పీవీ సింధు, యాంకర్ సుమ, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, సూపర్ స్టార్ కృష్ణ, బిత్తిరి సత్తి, షియాజీ షిండే, రోల్ రైడా, సామ్రాట్.. తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

పచ్చదనం పెంచే ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు వరుణ్ సందేశ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు , తనను నామినేట్ చేసిన సామ్రాట్‌కు అభినందనలు తెలిపారు. ఇక తనలాగే మొక్కలు నాటాల్సిందిగా అరుణ్ ఆదిత్ , ఆదర్శ్ బాలకృష్ణ , అల్లరి నరేష్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు వరుణ్ సందేశ్.

కాగా, తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 24, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading