కూలీ నెం.1 రీమేక్‌‌కు ఓకే చెప్పిన వరుణ్ ధావన్..

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగులో హిట్టైన సినిమాలను వరసగా హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్కడి మూవీ మేకర్స్. తాజాగా వరుణ్ ధావన్ కూలీ నెం.1 రీమేక్‌కు ఓకే చెప్పాడు.

news18-telugu
Updated: April 24, 2019, 1:15 PM IST
కూలీ నెం.1 రీమేక్‌‌కు ఓకే చెప్పిన వరుణ్ ధావన్..
వరుణ్ ధావన్
news18-telugu
Updated: April 24, 2019, 1:15 PM IST
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగులో హిట్టైన సినిమాలను వరసగా హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్కడి మూవీ మేకర్స్. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో గోవిందా, కరిష్మా కపూర్ హీరో, హీరోయిన్లుగా డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఇపుడు కొడుకు వరుణ్ ధావన్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ రోజు వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా  ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో వెల్లడించాడు. అప్పట్లో కూలీ నెంబర్ 1 సినిమాను నిర్మించిన వసు భగ్నానీ 25 ఏళ్ల తర్వాత ఈ రీమేక్‌ను నిర్మించడం విశేషం.  ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన సారా అలీ ఖాన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. వచ్చే ఆగష్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాను తెలుగులో సుమన్ హీరోగా ‘చిన్నల్లుడు’గా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్టైయింది. 

govinda,david dhawan Coolie No 1 movie to Remake by Varun Dhawan in Bollywood in his father david dhawan direction after judwaa 2,varun dhawan,coolie no 1 remake,varun dhawan in coolie no 1 remake,varun dhawan coolie no 1,coolie no 1,coolie no. 1 remake,varun replace govinda in coolie no 1,saara ali khan in coolie no 1,varun dhawan coolie no.1,coolie no. 1,coolie no.1 remake,varun dhawan remake,david dhawan,varun dhawan movies,varun dhawan upcoming movie,varun dhawan new movie,varun dhawan next movie,varun dhawan twitter,varun dhawan instagram,varun dhawan david dhawan coolie no 1 Remake,bollywood,jabardasth comedy show,hindi cinema, వరుణ్ ధావన్,వరుణ్ ధావన్ కూలీ నెం 1 రీమేక్,వరున్ ధావన్ గోవిందా కూలీ నెం 1 రీమేక్,వరుణ్ ధావన్ కూలీ నెంబర్ వన్,గోవిందా వరుణ్ ధావన్ కూలీ నెం 1,డేవిడ్ ధావన్ వరుణ్ ధావన్ కూలీ నెం 1,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,కూలీ నెం 1 రీమేక్ లో వరుణ్ ధావన్,హిందీ సినిమా,బాలీవుడ్ సినిమా,
కూలీ నెం.1 రీమేక్‌లో వరుణ్ ధావన్


ఇప్పటికే డేవిడ్ ధావన్ గతంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘హలో బ్రదర్’ను హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘జుడ్వా’గా రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత అదే సినిమాను తన కొడుకు వరుణ్ ధావన్‌తో ‘జుడ్వా 2’గా రీమేక్ చేసి కొడుకుకు మంచి హిట్‌ను అందించాడు.మరి ఇపుడు గోవిందా హీరోగా తెరకెక్కిన కూలీ నెం.1 రీమేక్‌తో వరుణ్ ధావన్‌కు మరో హిట్టు అందిస్తాడా లేదా అనేది చూడాలి.
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...