బిగ్ బాస్ షోపై ప్రభుత్వం నిషేధం.. షాక్‌లో నిర్వాహకులు..?

Bigg Boss 4: తెలుగులో రియాలిటీ షోలు చూడరు అనే సెంటిమెంట్‌కు బ్రేక్ చెప్పిన షో బిగ్ బాస్. ఓ ఇంట్లో కొందరిని వదిలేసి వాళ్లు చేసే పనులు చూడ్డానికి మాకేం పని లేదా అన్నవాళ్లు కూడా హాయిగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 25, 2020, 6:02 PM IST
బిగ్ బాస్ షోపై ప్రభుత్వం నిషేధం.. షాక్‌లో నిర్వాహకులు..?
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
  • Share this:
తెలుగులో రియాలిటీ షోలు చూడరు అనే సెంటిమెంట్‌కు బ్రేక్ చెప్పిన షో బిగ్ బాస్. ఓ ఇంట్లో కొందరిని వదిలేసి వాళ్లు చేసే పనులు చూడ్డానికి మాకేం పని లేదా అన్నవాళ్లు కూడా హాయిగా ఈ షో మొదలైన వెంటనే టీవీల ముందు కూర్చున్నారు. రేటింగ్స్ విషయంలో కూడా దుమ్ము దులిపేసింది బిగ్ బాస్. తొలి సీజన్ బ్లాక్‌బస్టర్ అయితే.. తర్వాత రెండు సీజన్స్ పర్లేదనిపించాయి. దాంతో ఇప్పుడు నాలుగో సీజన్‌పై కూడా అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సీజన్ 4 మొదలవుతుందా అని చూస్తున్నారు అభిమానులు. ఇక నిర్వాహకులు కూడా నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించాలని చూస్తున్నారు.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)


ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్‌లతో చర్చలు కూడా పూర్తయ్యాయి.. ఇక హోస్టుగా మరోసారి నాగార్జుననే రిపీట్ చేయాలని చూస్తున్నారు. అంతా బాగానే ఉంది.. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ 4 మొదలవుతుందనే సమయంలో ఇప్పుడు సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రబలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ బిగ్ బాస్ షో మొదలైతే అందులో భౌతిక దూరం పాటించడం అనేది కష్టమే.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్‌బాస్ లోగో (Twitter/Photo)


పైగా ఈ షో కోసం లోపలున్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. బయట మరో 200 మంది పని చేస్తుంటారు. దాంతో పాటు కంటెస్టెంట్స్ అంతా 100 రోజులకు పైగా ఒకే ఇంట్లోనే కలిసి ఉండాల్సి వస్తుంది. దానికి తోడు బిగ్‌బాస్‌ ఇచ్చే కొన్ని టాస్క్‌ల్లో భౌతిక దూరం దూరంగా వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షోను ఆపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
‘బిగ్‌ బాస్’(Facebook/Photo)


ఒక్క భాషలోనే కాదు అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తుంది. దాంతో ఈ సారి బిగ్ బాస్ అనేది ఉండకపోవచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఒకవేళ అదే జరిగితే బిగ్‌బాస్‌ నిర్వాహకులకు కోట్లలో నష్టం వస్తుంది. తెలుగులో తక్కువే కానీ హిందీలో మాత్రం ఈ షో వందల కోట్ల ఆదాయం తీసుకొస్తుంది. మరి చూడాలిక.. బిగ్ బాస్ 2020 ఏమవుతుందో..?
First published: May 25, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading