ఆ డైరెక్టర్‌పై భగ్గుమన్న పోసాని..? షూటింగ్‌లో అలా తన్నినందుకే..?

పోసాని కృష్ణమురళి

రియలిస్టిక్ ఫీల్ కోసం దర్శకుడు అలా చేయించినందుకు నటుడు పోసాని కృష్ణమురళి ఆయనపై సీరియస్ అయ్యారట..

  • Share this:
    ఇటీవలే విడుదలైన నిఖిల్ 'అర్జున్ సురవరం' సినిమా గురించి ఓ ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది.ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు పోసాని కృష్ణమురళి దర్శకుడు సంతోష్‌పై విరుచుకుపడ్డారట.అలా ఇలా కాదట.. తిట్ల దండకంతో దర్శకుడిని కంగారెత్తించారట. పోసాని ఎందుకంతలా సీరియస్ అయ్యారంటే.. దర్శకుడు షూట్ చేసిన ఓ సీన్ ఇందుకు కారణమట.

    ఇంతకీ ఏంటా సీన్ అంటే.. సినిమాలో విలన్ పోసానిని బూటు కాలితో గుండెలపై తన్నే సన్నివేశం ఉందట. ఆ సీన్ షూట్ చేసే సమయంలో అతని బూటు కాలు పోసానికి బలంగా తగిలి వెనక్కి పడ్డంత పనైందట. దీంతో పోసాని అసహనానికి లోనయ్యారట. రియలిస్టిక్ ఫీల్ కోసం నిజంగానే గట్టిగా తన్నిస్తారా..? అని దర్శకుడితో గొడవపడ్డారట.నోటికొచ్చినట్టు ఆయన్ను తిట్టారట. అయితే తమిళ దర్శకుడు సంతోష్‌కి ఆ తిట్లేవి అర్థంకాక తల పట్టుకున్నాడట.ఏదేమైనా ఆ వివాదం అక్కడితోనే సద్దుమణగడంతో దర్శకుడు సంతోష్, నటుడు పోసాని అంతకుముందులాగే షూటింగ్‌లో పాల్గొన్నారట.
    Published by:Srinivas Mittapalli
    First published: