GOSSIPS ABOUT VAISHNAV TEJ KRITHI SHETTY STARRER UPPENA STORY HERO BECOMES TRANSGENDER IN FINAL MNJ
Uppena: ఉప్పెన స్టోరీపై సోషల్ మీడియాలో పుకార్లు. అదే నిజమైతే.. ప్రేక్షకులు ఒప్పుకుంటారా..!
ఉప్పెన సినిమా (Uppena Movie)
Uppena: టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరో మేనట్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
Uppena: టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అంతేకాదు దర్శకుడు బుచ్చిబాబు సనకు కూడా ఇదే తొలి చిత్రం అవ్వడం గమనర్హం. ఇలా ఈ ముగ్గురు కొత్త వారే అయినప్పటికీ.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణాలు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించడం.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం. ఇలా ఈ మూవీపై అభిమానుల్లో మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్లుగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకోవడంతో.. ఉప్పెనపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఈ మూవీని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈ మూవీ గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండాల్సింది. కానీ కరోనా రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో అప్పట్లో చాలా చిత్రాలు ఓటీటీలో విడుదల కాగా.. ఉప్పెన కూడా ఓటీటీలో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా కథపై నమ్మకం ఉండటంతో.. దర్శకనిర్మాతలు మాత్రం థియేటర్లు తెరుచుకునే వరకు ఎదురుచూశారు.
ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు.. ఉప్పెన కథపై చాలా కామెంట్లు వినిపించాయి. ఈ స్టోరీ ఆర్ఎక్స్ 100, కలర్ ఫొటోలను పోలి ఉందని చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కథ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. టీజర్ చివర్లో వైష్ణవ్ తేజ్‌ని గాయపరిచినట్లు చూపించగా.. ఈ మూవీలో హీరోను నపుంశకుడిని చేస్తాడన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. ఒకవేళ ఆ కథతోనే సినిమా తెరకెక్కి ఉంటే మాత్రం ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకుంటారన్నది చూడాలి. మరి ఇందులో నిజమెంత..? అసలు ఉప్పెన ఎలా ఉండబోతుంది..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరో 11 రోజులు ఆగాల్సిందే.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.