Home /News /movies /

GOPICHAND TO DO HIS NEXT WITH TAMIL MASS DIRECTOR HARI HERE ARE THE DETAILS SR

Gopichand : ఊరమాస్ డైరెక్టర్‌తో మాచో స్టార్ గోపీచంద్.. మరో తమిళ దర్శకుడి ఎంట్రీ..

Gopichand Photo : Twitter

Gopichand Photo : Twitter

Gopichand | Hari : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Gopichand | Hari : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది. గోపీచంద్ ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ హరి (Hari) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన (Singam Series) ‘సింగం’ సిరీస్ సినిమాలతో సూపర్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈ సింగం సిరీస్‌లో సూర్య, అనుష్క హీరో, హీరోయిన్స్‌గా చేసిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సినిమాలు మంచి విజయం సాధించగా.. మూడో సినిమా అనుకున్నంతగా అలరించలేదు. ఈ సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమాను చేయనున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించారు. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారట. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో ఊపు మీదున్న జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్, బ‌న్నీవాసు కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా వస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

    పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. అంతేకాదు ఈ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఇక తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదరగొడుతోందీ పాట.

    Chiranjeevi |God Father : చిరంజీవి గాడ్ ఫాదర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ మూడు సినిమాలతో పోటీ..

    ఇక గోపీచంద్ (Gopichand) విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్‌ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌‌గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Gopichand, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు