Home /News /movies /

GOPICHAND TAMANNAAH SEETIMAARR TWITTER REVIEW SR

Gopichand | Seetimaarr Twitter Review : గోపీచంద్ తమన్నాల సీటీమార్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

Seetimaarr Twitter Review Photo : Twitter

Seetimaarr Twitter Review Photo : Twitter

Gopichand | Seetimaarr Twitter Review : గోపీచంద్, తమన్నాలు జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

    మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. సీటీమార్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. గోపీచంద్‌కు జంటగా తమన్నా నటించింది. తమన్నా  (Tamannaah)ఈ సినిమా కోసం సొంతంగా  డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటిస్తున్నారు.

    ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విట్టర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం..










    ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట జ్వాలా రెడ్డికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.

    ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించనుంది. మాస్ట్రో వస్తున్న ఈ సినిమాలో హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా త్వరలో హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన‌్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతోపాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Gopichand, Seetimaarr Movie, Tamanna, Tollywood news

    తదుపరి వార్తలు