Gopichand - Seetimaarr: హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా సక్సెస్ దోబూచులాడుతోంది. ‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఆ తర్వాత చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. మధ్యలో ‘జిల్’ సినిమాతో మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు. ఇక 2019లో ఈ యాక్షన్ హీరో తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ సినిమా చేసాడు. పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను చిరంజీవి.. సైరా నరసింహారెడ్డికి పోటీగా రిలీజ్ చేసాడు. ఆ సినిమాతో పోటీపడలేక ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమన్నా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. మరోవైపు తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో కథనాాయకగా దిగాంగన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి అపుడు సక్సెస్ లేని గోపీచంద్ ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తాడో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.