యాక్షన్ హీరో మాచో స్టార్ గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సీటీమార్. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు. సీటీమార్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో గోపీచంద్ ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమాను చిత్రీకరించారట. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వడంతో విడుదలకు సిద్ధంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీని ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా టీమ్ ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తుండడంతో.. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ ఇంట్రెంస్టింగ్ ఉంటుందట.
ఇక ఇదే కాంబినేషన్లో గతంలో భారీ అంచనాల నడుమ వచ్చిన గౌతమ్ నంద చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. చూడాలి మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండనుందో..
ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ సినిమాను పూర్తి చేసి మరో సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో 'అలిమేలుమంగ వెంకటరమణ' అనే సినిమా చేస్తోన్నాడు. గోపీచంద్ తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టిన తేజతో హీరోగా చేస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా కోసం తేజ ఓ అదిరిపోయే స్టోరిని సిద్ధం చేశాడట. ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం స్క్రిప్ట్ ను కూడా ఫైనల్ చేసిందట. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తోంది. వీటిలో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాను హిట్ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.
సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇదే కాంబోలో గతంలో “భలే భలే మగాడివోయ్”, “ప్రతిరోజూ పండగే” చిత్రాలు వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
Published by:Suresh Rachamalla
First published:January 24, 2021, 07:31 IST