హోమ్ /వార్తలు /సినిమా /

Gopichand | Seetimaarr : సీటీమార్ ఏడు రోజుల కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే..

Gopichand | Seetimaarr : సీటీమార్ ఏడు రోజుల కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే..

గోపీచంద్ సీటీమార్ (Gopichand Seetimaarr)

గోపీచంద్ సీటీమార్ (Gopichand Seetimaarr)

Gopichand | Seetimaarr : యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం సీటీమార్. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.. మరి ఏడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..

మాచో స్టార్ గోపీచంద్,  (Gopichand) తమన్నా (Tamannaah ) ల కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr). మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా 600 వరకు థియేటర్‌‌లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్‌ను సొంతం చేసుకుంది. సీటీమార్ మాస్ మూవీ అవ్వడం తో బి సి సెంటర్స్ లో థియేటర్స్ దగ్గర టికెట్లు సాలిడ్‌గా తెగుతున్నాయి. దీంతో మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.98 కోట్ల రేంజ్ షేర్‌ని సొంతం చేసుకుంది.

సీటీమార్ ఏడు రోజుల కలెక్షన్స్..

ఇక మొదటి వారం కలెక్షన్స్ విషయానికి వస్తే.. సీటీమార్ 7వ రోజు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్స్

నైజాం: 8L

సీడెడ్: 7L

UA: 7L

ఈస్ట్: 4L

పశ్చిమ: 3L

గుంటూరు: 4L

కృష్ణ: 3L

నెల్లూరు: 2L

మొత్తం:- 0.38CR (0.68 కోట్లు) )

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాదాలు.. సోక సంద్రంలో కుటుంబ సభ్యులు..

సీటీమార్ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కలెక్షన్స్

మొదటి రోజు 1: 2.98C

రెండవ రోజు 2: 1.74C

మూడో రోజు 3: 1.51Cr

నాలుగో రోజు 4: 72L

ఐదో రోజు 5: 51L

ఆరవరోజు 6: 43L

ఏడవ రోజు 7: 38L

మొత్తం రెండు రాష్ట్రాల్లో : 8.26CR (13.68CR గ్రాస్)

KA+ROI: 32L

OS: 8L

TOTAL Collections: 8.67CR(14.55CR గ్రాస్)

బ్రేక్ ఈవెన్ కావాలంటే..

ఇక సీటీమార్‌ సినిమాను 11.5 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. 12 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా రంగంలోకి దిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకా 3.33Cr షేర్‌ను రాబట్టాలి. చూడాలి మరి ఎంత వరకు రాబడుతుందో..

Tollywood Drugs Case : ఈడీ ముందుకు నటుడు తనీష్.. కొనసాగుతోన్న విచారణ...

స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి తమన్నా  (Tamannaah) సొంతంగా  డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు.

ఈ సినిమాలో జ్వాలా రెడ్డి పాటకి మంచి స్పందన వచ్చింది. మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటించింది.

గోపీచంద్ ఇతర సినిమాలు..

ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.

First published:

Tags: Seetimaarr Movie, Tollywood news

ఉత్తమ కథలు