Home /News /movies /

GOPICHAND SEETIMAARR GOPICHAND TAMANNAAH SAMPATH NANDI RELEASE ON 3 SEPTEMBER 2021 TA

Gopichand - Seetimaarr : గోపీచంద్, తమన్నాల ‘సీటీమార్’ విడుదల తేది ఖరారు..

గోపీచంద్ ‘సీటీమార్’ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

గోపీచంద్ ‘సీటీమార్’ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

Gopichand - Seetimaarr : గోపీచంద్, తమన్నాల ‘సీటీమార్’ విడుదల తేది ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    Gopichand - Seetimaarr : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్నో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దాంతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇపుడిపుడే కరోనా కేసులు తగ్గి పరిస్థితులు కుదటపడటంతో ఒక్కొక్కరు తమ సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమా షూటింగ్ ఎపుడో పూర్తి చేసుకొంది. అంతా బాగుంటే ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల అయ్యేది. పవన్ కళ్యాణ్  ‘వకీల్ సాబ్’ సినిమాకు వారం ముందు విడుదల చేస్తే వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేద్దామనుకునే లోపు కరోనా సెకండ్ వేవ్ మన దేశంపై విరుచుకపడింది.

    దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.


    ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు.  మరోవైపు తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో కథానాాయకగా దిగాంగన నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి అపుడు సక్సెస్ లేని గోపీచంద్ ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తాడో లేదో చూడాలి.

    ఇవి కూడా చదవండి.. 

    Ram Gopal Varma : తనదైన శైలిలో మరోసారి మెగా ఫ్యామిలీ రామ్ గోపాల్ వర్మ పంచ్‌లు..


    Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..


    Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్లూ భాయ్‌కు చుక్కలు చూపించిన యువ అధికారి..


    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Gopichand, Seetimaarr Movie, Tamannaah, Tollywood

    తదుపరి వార్తలు