Home /News /movies /

GOPICHAND SEETIMAARR GETS PRAISES FROM PRABHAS SR

Prabhas | Gopichand : నా ఫ్రెండ్ సినిమా అదిరిపోయింది.. సీటీమార్‌కు ప్రభాస్ ప్రశంసలు..

Prabhas and Gopichand Photo : Twitter

Prabhas and Gopichand Photo : Twitter

Prabhas | Gopichand : ప్రభాస్, గోపీచంద్‌లు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల గోపీచంద్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో నా ఫ్రెండ్ సినిమా అదిరిపోయిందంటూ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇంకా చదవండి ...
    మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్“సీటీమార్”. కోవిడ్ కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇటీవల విడుదలై థియేటర్స్‌లో అదరగొడుతోంది. అంతేకాదు పలు పాన్ ఇండియన్ సినిమా, హిందీ సినిమాలకు కూడా రాని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. దీనితో ఈ ఏడాది లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలోకి వెళ్ళింది సీటీమార్. గోపీచంద్ (Gopichand Seetimaarr) కెరీర్‌లోనే ఫస్ట్ డే కలెక్షన్స్’లో టాప్ సినిమాగా సీటీమార్ నిలిచింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి... గోపీచంద్ నటనపై రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas )ప్రశంసల వర్షం కురిపించారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక విజిల్ ని పెట్టి “నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నాకు ఆనందంగా ఉంది. ఈ కోవిడ్ సమయంలో మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేసి గొప్ప ప్రయత్నం చేసారన్నారు. గోపీచంద్, ప్రభాస్‌లు మంచి స్నేహితులు అని తెలిసిందే.

    ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన సలార్‌తో పాటు ఆదిపురుష్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు ఆయన రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)







    ఇక సీటీమార్ విషయానికి వస్తే.. గోపీచంద్,  (Gopichand) తమన్నా (Tamannaah ) ల కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr) మంచి ఆదరణ పొందుతోంది. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా 600 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ ను సొంతం చేసుకుంది. దీనికి తోడు ఈ సినిమా కి వినాయక చవితి హాలిడే కలిసి రావడం కూడా హెల్ప్ అయ్యింది.

    సీటీమార్ మాస్ మూవీ అవ్వడం తో బి సి సెంటర్స్ లో థియేటర్స్ దగ్గర టికెట్లు సాలిడ్ గా తెగుతున్నాయి. దీంతో మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.98 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 3.16 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది, గ్రాస్ 5 కోట్లకు పైగా వచ్చింది.

    ఇక ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీటీమార్‌ సినిమాను 11.5 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. అయితే సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 8.84 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది.

    స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి అంచనాలను పెంచింది. దానికి తగ్గట్లుగానే సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమన్నా  (Tamannaah)ఈ సినిమా కోసం సొంతంగా  డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది.

    ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు.

    ఈ సినిమాలో జ్వాలా రెడ్డి పాటకి మంచి స్పందన వచ్చింది. మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటించింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Gopichand, Prabhas, Seetimaarr Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు