GOPICHAND SEETIMAARR GETS GOOD RESPONSE SECOND DAY ALSO IN THEATERS HERE IS THE SECOND DAY COLLECTION ESTIMATION SR
Gopichand | Seetimaarr : అదరగొడుతోన్న గోపీచంద్ సీటీమార్... రెండో రోజు అదే ఊపు..
Seetimaarr Photo : Twitter
Gopichand | Seetimaarr : మాచో స్టార్ గోపీచంద్ తమన్నాలు జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.
మాచో స్టార్ గోపీచంద్, (Gopichand) తమన్నా (Tamannaah ) ల కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr). మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా 600 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ ను సొంతం చేసుకుంది. దీనికి తోడు ఈ సినిమా కి వినాయక చవితి హాలిడే కలిసి రావడం కూడా హెల్ప్ అయ్యింది. సీటీమార్ మాస్ మూవీ అవ్వడం తో బి సి సెంటర్స్ లో థియేటర్స్ దగ్గర టికెట్లు సాలిడ్ గా తెగుతున్నాయి. దీంతో మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.98 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 3.16 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది, గ్రాస్ 5 కోట్లకు పైగా వచ్చింది.
ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Nizam: 91L
Ceeded: 55L
UA: 30L
East: 27L(6L hires)
West: 16L
Guntur: 41L(11L hires)
Krishna: 19L
Nellore: 19L(5L hires)
Total AP TG: 2.98CR(4.75cr~ Gross)(22L hires)
KA+ROI: 14L
OS: 4L~(No release in USA)
TOTAL Collections: 3.16CR(5.10CR~ Gross)
1st Day Highest Gross Movies in India After 2nd Wave
ఇక ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీటీమార్ సినిమాను 11.5 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. అయితే సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 8.84 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి అంచనాలను పెంచింది. దానికి తగ్గట్లుగానే సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమన్నా (Tamannaah)ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr) 'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా (Tamannaah ) నటించారు.
ఈ సినిమాలో జ్వాలా రెడ్డి పాటకి మంచి స్పందన వచ్చింది. మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటించింది.
ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.