Home /News /movies /

GOPICHAND SAMPATH NANDI TAMANNAAH SEETIMAARR MOVIE CENSOR COMPLETED TA

Gopichand - Seetimaarr : సెన్సార్ పూర్తి చేసుకున్న గోపీచంద్ ‘సీటీమార్’ మూవీ.. టాక్ ఎలా ఉందంటే..

గోపీచంద్ ‘సీటీమార్’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

గోపీచంద్ ‘సీటీమార్’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

Gopichand - Seetimaarr : గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

    Gopichand - Seetimaarr : గోపీచంద్  (Gopichand) హీరోగా నటిస్తోన్న లేెటెస్ట్ మూవీ ‘సీటీమార్’(Seetimaarr). తమన్నా (Tamannaah) కథానాయికగా నటిస్తోంది. దిగాంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటిస్తోంది. భూమిక మరో పాత్రలో యాక్ట్ చేస్తోంది.  ఈ సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. సంపత్ నంది (Sampath Nandi ) డైరెక్ట్ చేసారు.  గతంలో సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన  ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇపుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సీటీమార్’ సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ టాక్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు.

    సెన్సార్ వాళ్లు ఇందులో స్పోర్ట్స్ నేపథ్యంలో ఎంతో ఎమోషనల్‌గా ఉందన్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ లెవల్లో ఉన్నాయనేది టాక్. ఇప్పటికే ఒలింపిక్స్‌లో మన భారత్ ఎక్కువ పతాకాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కామన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. గోపీచంద్ మరోసారి తన యాక్షన్ అండ్ ఎమోషన్‌తో ఆకట్టుకున్నాడట.



    ‘సీటీమార్’ విషయానికొస్తే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్నో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దాంతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇపుడిపుడే కరోనా కేసులు తగ్గి పరిస్థితులు కుదటపడటంతో ఒక్కొక్కరు తమ సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అదే కోవలో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమా షూటింగ్ ఎపుడో పూర్తి చేసుకొంది.

    Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..

    మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.



    అంతా బాగుంటే ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల అయ్యేది. పవన్ కళ్యాణ్  ‘వకీల్ సాబ్’ సినిమాకు వారం ముందు విడుదల చేస్తే వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేద్దామనుకునే లోపు కరోనా సెకండ్ వేవ్ మన దేశంపై విరుచుకుపడింది.దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అంతేకాదు సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చివరకు వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Censor Board, Gopichand, Seetimaarr Movie, Tamannaah, Tollywood

    తదుపరి వార్తలు