అవును హీరో గోపీచంద్ వరుణ్ తేజ్ టైటిల్ కొట్టేసాడు. హీరోగా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు కూడా కంప్లీట్ కాలేదు. అపుడే వరుణ్ తేజ్ నటించిన సినిమా టైటిల్ గోపీచంద్ కొట్టేయడమేమిటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..
అవును హీరో గోపీచంద్ వరుణ్ తేజ్ టైటిల్ కొట్టేసాడు. హీరోగా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు కూడా కంప్లీట్ కాలేదు. అపుడే వరుణ్ తేజ్ నటించిన సినిమా టైటిల్ గోపీచంద్ కొట్టేయడమేమిటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. గోపిచంద్ ..ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ‘చాణక్య’ సినిమా చేసాడు.ఈ సినిమాలో గోపీచంద్ ఇండియన్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమా దసరా కానుకగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ వరుసగా రెండు సినిమాలకు కమిటయ్యాడు.అందులో ఒకటి సంపత్ నంది సినిమా కూడా ఉంది.
సంపత్ నందితో గోపిచంద్ కొత్త మూవీ (Twitter/Photo)
గతంలో వీళ్లిద్దరు కలిసి ‘గౌతమ్ నందా’ సినిమా చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఐనా ఈసారైనా హిట్టు కొట్టాలనే కసితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా టైటిల్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాలో నటిస్తాడు. ఆ సినిమా టైటిల్ పేరు ‘సీటీమార్’. ఇపుడు అదే టైటిల్ను గోపీచంద్..సంపత్ నంది సినిమాకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. తమన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.