GOPICHAND RAASHI KHANNA MARUTHI PAKKA COMMERCIAL GETS A NEW RELEASE DATE THIRD TIME HERE ARE THE DETAILS SR
Gopichand | Pakka Commercial : గోపీచంద్ పక్కా కమర్షియల్ విడుదల తేదీ మరోసారి మారింది... కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Pakka commercial Photo : Twitter
Gopichand | Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి విడుదలకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. గతంలో ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నామన్నారు.
Gopichand | Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి విడుదలకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. గతంలో ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నామన్నారు. ఆ తర్వాత మే 20, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా ఈ సినిమా విడుదల తేది మరోసారి మారింది. ఈ సినిమా విడుదల తేదిని మార్చుతూ చిత్రబృందం మరోసారి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించారు. ఇక ఈ (Pakka Commercial) సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారట. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో ఊపు మీదున్న జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, బన్నీవాసు కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా వస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఈ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇక తాాజగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదరగొడుతోందీ పాట.
ఇక గోపీచంద్ (Gopichand) విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.