Gopichand - Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా పాటలను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అది అలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గించబోతున్నట్టు తెలిపారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రేట్స్ ఎలా ఉంటాయో కూడా ప్రకటించారు.
ఆయన చెప్పిన ప్రకారం.. నైజాం (తెలంగాణ) మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్ రేట్లు ఉంటాయి.ఇక తాజాగా ఇదే విధంగా అడివి శేష్ మేజర్, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలకు టికెట్స్ తగ్గింపు బాగానే కలిసొచ్చింది.ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Mazzzaaa Vasthadi theatres lo...Vacheyandi!????
Here's the ????????????????????-???????????????????????? Release Trailer of #PakkaCommercial ????????
▶️ https://t.co/R1M3UF5JdB #PakkaCommercialOnJuly1st ????#AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @adityamusic pic.twitter.com/74Go8kPUO9
— BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2022
ఈ ట్రైలర్లో తండ్రి, కొడుకులకు విడాకులు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అంతేకాదు ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నిండివుంది. దీంతో పాటు రాశీ ఖన్నా (Raashi Khanna) రోల్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తంగా ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. అందాల రాశి అంటూ సాగే ఈ పాట బాగుంది. నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. కృష్ణ కాంత్ రాశారు. శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.
ఇక ఈ సినిమా విడుదల విషయంలో అనేక వాయిదాలు వచ్చాయి. ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి (Maruthi) చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gopichand, Maruthi, Pakka Commercial, Raashi Khanna, Tollywood