Gopichand | Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి విడుదలకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా జులై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుందని తెలిపింది టీమ్. గతంలో ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నామన్నారు. ఆ తర్వాత మే 20, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా ఈ సినిమా విడుదల తేది మరోసారి మారింది. ఈ సినిమా విడుదల తేదిని మార్చుతూ చిత్రబృందం మరోసారి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించారు.ఇక ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి.
ఇక ఈ (Pakka Commercial) సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది.
#PakkaCommercial 2nd Single #AndalaRaasi will be out on 𝐉𝐔𝐍𝐄 𝟏𝐬𝐭, Promo out soon!! ❤️
A @JxBe Musical 🎹#AlluAravind @YoursGopichand @DirectorMaruthi@RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations @adityamusic #PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/WTD69XL5LP
— Aditya Music (@adityamusic) May 26, 2022
ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gopichand, Pakka Commercial, Tollywood news