Home /News /movies /

GOPICHAND PAKKA COMMERCIAL MOVIE TRAILER GLIMSE RELEASE ON 8TH JUNE 4HR 05MINS TA

Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మూవీ ట్రైలర్ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు..

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Gopichand - Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారైంది.

ఇంకా చదవండి ...
  Gopichand - Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా పాటలను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక అది అలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గించబోతున్నట్టు తెలిపారు.  ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా ‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రేట్స్ ఎలా ఉంటాయో కూడా ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం.. నైజాం (తెలంగాణ) మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయి.

  ఇక తాజాగా ఇదే విధంగా అడివి శేష్ మేజర్, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలకు టికెట్స్ తగ్గింపు బాగానే కలిసొచ్చింది. తగ్గింపు రేట్లతోనే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. దీంతో మిగతా సినిమాలు కూడా టికెట్స్ రేట్స్ తగ్గించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ‘పక్కా కమర్షియల్’ చిత్రానికి టికెట్స్ రేట్స్‌ను ఒకప్పటి రేట్స్‌కు కాస్త ఎక్కువ మొత్తంలో అమ్మడానికి ముందుకొచ్చారు.  ఇప్పటికే విపరీతంగా పెరిగిన టిక్కెట్ల రేట్ల వల్ల పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా మొదటి రోజు నుంచి థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. దీంతో తత్త్వం బోధపడిన  దర్శక నిర్మాతలు టికెట్ల రేట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ గ్లింప్స్‌ను జూన్ 8 (బుధవారం ) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

  గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్‌ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)


  ఇక పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మధ్యలో ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాతో పలకరించాడు.  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ క‌లిసి, బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటించారు.

  Tollywood Hit Movies 2022 : RRR,KGF2, మేజర్, విక్రమ్ సహా 2022లో హిట్ స్టేటస్ అందుకున్న మూవీస్..

  ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది.

  F3 : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల F3 మూవీ టోటల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

  ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్‌ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌‌గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu aravind, Gopichand, Maruthi, Pakka Commercial, Raashi Khanna

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు