Home /News /movies /

Jr NTR - Gopichand: అప్పుడు ఎన్టీఆర్ చేసిన కథే ఇప్పుడు గోపీచంద్ చేస్తున్నాడా..?

Jr NTR - Gopichand: అప్పుడు ఎన్టీఆర్ చేసిన కథే ఇప్పుడు గోపీచంద్ చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ గోపీచంద్ (Jr NTR Gopichand)

ఎన్టీఆర్ గోపీచంద్ (Jr NTR Gopichand)

Jr NTR - Gopichand: ఇండస్ట్రీలో ఒకే కథతో వచ్చే సినిమాలు చాలానే ఉంటాయి. లెక్కలు తీస్తే అన్ని సినిమాల కథలు ఒకేలా ఉంటాయి. స్క్రీన్ ప్లే మార్పులతో వాటిని తమకు కావాల్సినట్లు తెరకెక్కిస్తుంటారు దర్శకులు. అలా ఆరేళ్ల కింద నందమూరి బ్రదర్స్..

ఇంకా చదవండి ...
ఇండస్ట్రీలో ఒకే కథతో వచ్చే సినిమాలు చాలానే ఉంటాయి. లెక్కలు తీస్తే అన్ని సినిమాల కథలు ఒకేలా ఉంటాయి. స్క్రీన్ ప్లే మార్పులతో వాటిని తమకు కావాల్సినట్లు తెరకెక్కిస్తుంటారు దర్శకులు. అలా ఆరేళ్ల కింద నందమూరి బ్రదర్స్ నటించిన రెండు సినిమాలు ఒకే కథతో వచ్చాయి. అవే పటాస్, టెంపర్. అలాంటి కథనే ఇప్పుడు మరోసారి గోపీచంద్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే టెంపర్, పటాస్ సినిమాలు ఒకే టైమ్‌లో విడుదలయ్యాయి. కేవలం 2 వారాల గ్యాప్‌లోనే ఈ సినిమాలు విడుదల చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 2015లో పటాస్ విడుదలైతే.. ఫిబ్రవరిలో టెంపర్ వచ్చింది. ఈ రెండు సినిమాల్లోనూ కథ ఒకటే. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్.. తన వల్ల అన్యాయం అయిపోయిన ఓ అమ్మాయి జీవితం కాపాడటానికి సిన్సియర్ అవుతాడు.. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇందులో పటాస్ ఫుల్ ఎంటర్‌టైనర్ అయితే.. టెంపర్ మాత్రం ఎమోషనల్ రైడ్ అయింది. పూరీ జగన్నాథ్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో టెంపర్ సినిమాను పిచ్చెక్కించాడు. టెంపర్.. ఇటు పటాస్ చెప్పే కథలు ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉండటం.. దర్శకత్వ ప్రతిభతో ఈ రెండూ మంచి విజయం సాధించాయి. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత మారుతి దాదాపు అలాంటి కథనే గోపీచంద్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
gopichand pakka commercial,gopichand new movie,gopichand pakka commerical jr ntr temper movie,gopichand pakka commerical movie,gopichand pakka commerical teaser,pakka commercial first look,gopichand pakka commerical movie official teaser,pakka commercial,pakka commercial gopichand,gopichand pakka commercial movie,gopichand pakka commercial movie first look,pakka commercial gopichand maruthi movie,gopichand telugu movies pakka commercial,hero gopichand pakka commercial movie opening,గోపీచంద్,మారుతి గోపీచంద్ పక్కా కమర్షియల్,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ పక్కా కమర్షియల్ గోపీచంద్ ఒకటే కథ
ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ (Jr NTR Kalyan Ram)

ఈయన దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు గోపీచంద్. మార్చ్ 5 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో గోపీచంద్ అవినీతి పరుడైన లాయర్‌గా నటించనున్నాడని.. డబ్బు కోసం ఎలాంటి కేసులైనా వాదించే పక్కా కమర్షియల్ లాయర్‌గా ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అలా తను వాదించిన ఓ కేసుతో ఓ కుటుంబం అన్యాయం అయిపోయిందని తెలుసుకుని.. వాళ్లకు మళ్లీ న్యాయం ఎలా చేసాడనేది కథ అని వార్తలొస్తున్నాయి.
gopichand pakka commercial,gopichand new movie,gopichand pakka commerical jr ntr temper movie,gopichand pakka commerical movie,gopichand pakka commerical teaser,pakka commercial first look,gopichand pakka commerical movie official teaser,pakka commercial,pakka commercial gopichand,gopichand pakka commercial movie,gopichand pakka commercial movie first look,pakka commercial gopichand maruthi movie,gopichand telugu movies pakka commercial,hero gopichand pakka commercial movie opening,గోపీచంద్,మారుతి గోపీచంద్ పక్కా కమర్షియల్,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ పక్కా కమర్షియల్ గోపీచంద్ ఒకటే కథ
పక్కా కమర్షియల్ టెంపర్ (Temper Pakka Commercial)

సినిమా అంతా కామెడీగానే ఉంటూ.. చివరి 15 నిమిషాలు మాత్రం ఎమోషనల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ కథ కూడా అలాంటిదే అయినా స్క్రీన్ ప్లే పరంగా మారుతి మాయ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gopichand, Jr ntr, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు