GOPICHAND NEW MOVIE TITLED AS CHANAKYA AND SHOOTING IS GOING ON IN SARILERU NEEKEVVARU SET PK
విజయశాంతి ఇంట్లో గోపీచంద్.. మహేశ్ అడ్డాలో యాక్షన్ హీరో జెండా..
గోపీచంద్ విజయశాంతి మహేశ్ బాబు
అదేంటి.. విజయశాంతి ఇంట్లో గోపీచంద్ ఉండటం ఏంటి.. మహేశ్ అడ్డాలో జెండా పాతడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. హీరోలు అన్న తర్వాత గాయలు కావడం కూడా కామన్.
అదేంటి.. విజయశాంతి ఇంట్లో గోపీచంద్ ఉండటం ఏంటి.. మహేశ్ అడ్డాలో జెండా పాతడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. నిజంగానే ఇప్పుడు గోపీచంద్ వెళ్లి విజయశాంతి ఇంట్లో ఉన్నాడని తెలుస్తుంది. హీరోలు అన్న తర్వాత గాయలు కావడం కూడా కామన్. షూటింగ్స్‌లో వాళ్లు పడుతూనే ఉంటారు.. దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గతేడాది ఈయన ‘పంతం’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు.
గోపీచంద్ ఫైల్ ఫోటో
ముందు ఏదో సాధారణంగా తీసుకున్నా కూడా ఆ తర్వాత అది సీరియస్ అని తేలడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఇప్పుడు కొత్త సినిమాకు సిద్ధమయ్యాడు గోపీచంద్. ఈ మధ్యే ఆయన కుడి భుజానికి గాయం అయింది. దాంతో సర్జరీ చేయించుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చాణక్య సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల రెస్ట్ తర్వాత ఇప్పుడే మళ్లీ షూటింగ్‌కు వచ్చాడు గోపీచంద్.
చాణక్య మూవీ పోస్టర్
తిరు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అక్కడ సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి ఇంటి కోసం వేసిన 4 కోట్ల సెట్లో గోపీచంద్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపీచంద్‌కు చాణక్య విజయం కీలకంగా మారింది. రెగ్యులర్ మాస్ సినిమాలతో విసిగిపోయిన గోపీచంద్ తొలిసారి ఓ స్పై థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు `చాణక్య` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ లోగోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.