గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ (Gopichand in Aaradugula Bullet Photo : Twitter)
Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎపుడో 2017 జూన్ 9న విడుదల కావాల్సిన మూవీ ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా .. నాలుగేళ్ల తర్వాత ఈ రోజు విడుదలైంది.
Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎపుడో 2017 జూన్ 9న విడుదల కావాల్సిన మూవీ ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా .. నాలుగేళ్ల తర్వాత ఈ రోజు విడుదలైంది. గోపీచంద్ హీరోగా నయనతార హీరో, హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్ మరో ముఖ్యపాత్రలో నటించి ఈ సినిమాకు యాక్షన్ సినిమాల డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. రీసెంట్గా మాచ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr) 'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా (Tamannaah ) నటించారు.
గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విషయానికొస్తే.. ఎపుడో విడుదల కావాల్సిన సినిమా కాబట్టి ఈ సినిమాను తక్కువ రేటుకు అమ్మేసారు. నైజాం (తెలంగాణ)లో రూ. 1 కోటి రూపాయలు, రాయలసీమ (సీడెడ్) రూ. 50 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 1.20 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి ఈ సినిమా రూ. 25 లక్షలకే బిజినెస్ క్లోజ్ చేశారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 2.95 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3 కోట్ల రాబట్టాలి. ‘సీటీమార్’ సక్సెస్‌తో గోపీచంద్ మంచి ఊపుమీదున్నారు. మరోవైపు దసరా సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు.
‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాను తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్ట్ చేసారు. నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమాను ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ 5 సొంతం చేసుకుంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు.
మణిశర్మ సంగీతం అందించారు. నాలుగేళ్లుగా ల్యాబులో ఉండిపోయిన ఈ సినిమా థియేటర్స్‌లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ సినిమాను తాండ్ర రమేష్ నిర్మించగా.. బి గోపాల్ దర్శకత్వం వహించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.