Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 19, 2020, 10:44 PM IST
ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)
ఒకప్పుడు థియేటర్లలో విడుదల కాని సినిమాలకు అలాగే బాక్సుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. అలా విడుదల కాలేని సినిమాలకు ఓటీటీ ఒక వరంగా మారుతుంది. అందుకే ఎప్పట్నుంచో అలాగే బాక్సుల్లో ఉండిపోయిన సినిమాలను ఒక్కొక్కటిగా ఓటిటిలో విడుదల చేయడానికి ఆసక్తి చూస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సందీప్ కిషన్ ఏడేళ్ల కింద నటించిన డికే బోస్ ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటే ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కీర్తి సురేష్ పెంగ్విన్.. జ్యోతిక సినిమా.. అమితాబ్ గులాబ్ సితావో లాంటి సినిమాలు ఓటిటిలో విడుదలయ్యాయి.

ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)
తెలుగులో అమృతరామమ్ సినిమా కూడా ఇలాగే విడుదలైంది. తాజాగా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా అందులోనే విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు.

ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)
ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. గోపీచంద్ వంటి యాక్షన్ హీరో.. నయనతార లాంటి సూపర్ స్టార్ ఉండటంతో కచ్చితంగా 'ఆరడుగుల బుల్లెట్'కు మంచి రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
First published:
June 19, 2020, 10:44 PM IST