Home /News /movies /

GOPICHAND MEHREEN CHANAKYA COMPLETED SHOOTING AND TEASER RELEASES TOMORROW SR

దసరాకు వస్తోన్న గోపిచంద్, మెహ‌్రీన్ చాణక్య‌.. రేపు టీజర్ విడుదల

Twitter.com/YoursGopichand

Twitter.com/YoursGopichand

గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.

    గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే గోపిచంద్‌కు ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేదు. గతేడాది ఆయన చేసిన ‘పంతం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేదు. అందుకే ఈ సారి హిట్టు కొట్టాలనే కసితో దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘చాణక్య’ అనే  ‘స్పై’ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. గోపిచంద్‌కు యాక్సిడెంట్ అవడం వలన షూటింగ్ కాస్తంత ఆలస్యం అయింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. షూటింగ్ ఎక్కవ భాగం భారత్, పాకిస్థాన్ బార్డర్‌లో షూట్ చేసారు.  విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.




    'చాణక్య' సినిమాకు సంబందించి... అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోని.. ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలను. అందులో భాగంగా ఈ సినిమా టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 9 సాయంత్రం గంట‌లు 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Gopichand, Telugu Cinema News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు