Home /News /movies /

GOPICHAND MARUTHI PAKKA COMMERCIAL RELEASE DATE CONFIREMED TA

Gopichand - Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ విడుదల తేది ఖరారు..

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ విడుదల తేది

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ విడుదల తేది

Gopichand - Pakka Commercial : కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేశారు.

    Gopichand - Pakka Commercial : కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ మధ్యే సీటీమార్ సినిమాతో పర్లేదనిపించారు గోపీచంద్. ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ సినిమాతో వచ్చాడు. అయితే ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. నాలుగేళ్ళ పాటు నానా తంటాలు పడి విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు గోపీచంద్. ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Chiranjeevi - Bhola Shankar : భోళా శంకర్ విషయంలో తమన్నాకు బిగ్ షాక్ ఇచ్చిన చిరంజీవి.. అంతా కీర్తి సురేష్ వల్లే..


    రీసెంట్‌గా విడుదలైన ఈ టీజర్‌లో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.

    Sobhan Babu: నట భూషణ శోభన్ బాబు రిజెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..


    గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

    Gopichand - Pakka Commercial : కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్.
    గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మూవీ విడుదల తేది (Twitter/Photo)


    తాజాగా ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘పక్కా కమర్షియల్’ టైటిల్‌కు తగ్గట్టు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పక్కా కమర్షియల్ అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Gopichand, Pakka Commercial, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు