హోమ్ /వార్తలు /సినిమా /

Pakka Commercial : గోపీచంద్ ’పక్కా కమర్షియల్’ ట్రైలర్ గ్లింప్స్ విడుదల.. కాస్త తేడా ఉందిగా..

Pakka Commercial : గోపీచంద్ ’పక్కా కమర్షియల్’ ట్రైలర్ గ్లింప్స్ విడుదల.. కాస్త తేడా ఉందిగా..

పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

Gopichand - Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

Gopichand - Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా పాటలను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక అది అలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గించబోతున్నట్టు తెలిపారు.  ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా ‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రేట్స్ ఎలా ఉంటాయో కూడా ప్రకటించారు.

ఆయన చెప్పిన ప్రకారం.. నైజాం (తెలంగాణ) మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయి.ఇక తాజాగా ఇదే విధంగా అడివి శేష్ మేజర్, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలకు టికెట్స్ తగ్గింపు బాగానే కలిసొచ్చింది.

తగ్గింపు రేట్లతోనే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. దీంతో మిగతా సినిమాలు కూడా టికెట్స్ రేట్స్ తగ్గించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ‘పక్కా కమర్షియల్’ చిత్రానికి టికెట్స్ రేట్స్‌ను ఒకప్పటి రేట్స్‌కు కాస్త ఎక్కువ మొత్తంలో అమ్మడానికి ముందుకొచ్చారు.ఈ సినిమా ట్రైలర్‌ గ్లింప్స్‌ను జూన్ 12న విడుదల చేస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ గ్లింప్స్‌లో విడుదల చేశారు.

ఈ ట్రైలర్ గ్లింప్స్‌ను కాస్త వెరైటీగా కట్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మధ్యలో ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాతో పలకరించాడు.  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ క‌లిసి, బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటించారు. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Balakrishna Remakes: మంగమ్మ మనవడు టూ లక్ష్మీ నరసింహా వరకు బాలయ్య రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది.

First published:

Tags: Gopichand, Pakka Commercial, Tollywood

ఉత్తమ కథలు