Gopichand : హీరో గోపీచంద్‌కు షూటింగ్లో ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ మ్యాచో స్టార్ .. ప్రస్తుతం గోపీచంద్ .. శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు లక్ష్యం 2 అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సందర్భంగా గోపీచంద్ కాలుకు స్వల్ప గాయాలైనట్టు ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ మీడియాకు తెలిపారు. గోపీచంద్‌కు పెద్దగా ప్రమాదం లేదంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. గోపీచంద్ సినిమాల విషయానికొస్తే.. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీటై విడుదలకు రెడీగా ఉంది.
దీంతో పాటు గోపీచంద్ ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ హరి (Hari) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన (Singam Series) ‘సింగం’ సిరీస్ సినిమాలతో సూపర్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈ సింగం సిరీస్‌లో సూర్య, అనుష్క హీరో, హీరోయిన్స్‌గా చేసిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సినిమాలు మంచి విజయం సాధించగా.. మూడో సినిమా అనుకున్నంతగా అలరించలేదు. ఈ సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమాను చేయనున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
ఇక గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించారు. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారట. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో ఊపు మీదున్న జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, బన్నీవాసు కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా వస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఈ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదరగొడుతోందీ పాట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.