ఆ వార్తల్నీ కొట్టిపడేసిన గోపీచంద్.. రజనీకాంత్ సినిమాలో నటించడంపై క్లారిటీ..

యాక్షన్ స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో 'సీటీమార్' అనే సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 20, 2020, 10:14 AM IST
ఆ వార్తల్నీ కొట్టిపడేసిన గోపీచంద్.. రజనీకాంత్ సినిమాలో నటించడంపై క్లారిటీ..
Instagram
  • Share this:
యాక్షన్ స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో 'సీటీమార్' అనే సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే.. గోపీచంద్ విలన్‌గా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై గోపీచంద్ స్పందించాడు. 'గత కొద్ది కాలంగా రజనీకాంత్‌ 'అన్నాత్తే' చిత్రంలో నేను విలన్‌గా నటిస్తున్నానంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలీదు. ఈ చిత్రంలో నేను ప్రతినాయకుడిగా నటించడం లేదు' అని గోపీచంద్‌ పేర్కోన్నాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ..'కరోనా టైమ్‌లో ఇలాంటి రూమర్లు వినాల్సి వస్తోంది. నేను విలన్‌గా ఏ సినిమాలో నటించడం లేదు. నాకు తెలిసి ఇలాంటి రూమర్‌ రావడానికి ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే రజనీ 'అన్నాత్తే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ నాకు మంచి స్నేహితుడు. గతంలో మేమిద్దం కలిసి 'శౌర్యం', 'శంఖం' వంటి చిత్రాలు చేశాం. అంతేకానీ.. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తీ' చిత్రంలో తాను విలన్ గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరో గోపీచంద్ స్పష్టం చేశాడు.
First published: April 20, 2020, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading