Home /News /movies /

GOPICHAND DONATED 10 LAKH RUPEES TO CORONA CRISIS CHARITY AND HE SPONSORING DAILY FOOD FOR 1500 MEMBERS TA

కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరో గోపీచంద్ విరాళం..

Instagram

Instagram

రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 10 లక్షల విరాళం అందజేసాడు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. తాజాగా కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో  ముందుగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఐనా వైరస్ ఉదృతి తగ్గకపోవడంతో మరో మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా.  లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. తాజాగా కరోనా కారణంగా పనులు లేకుండా పోయిన పేదలకు హీరో గోపీచంద్ తన వంతు సాయం అందించారు. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు ఒకనెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసారు. అంతేకాదు రోజు 1500 పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. .

    Gopichand donated Groceries and sufficient Daily Needs for 1 Month to 1000 plus poor Families,gopichand,gopichand donated groceries,gopichand covid 19,gopichand, corona virus,gopichand help 1000 plus poor families,tollywood,telugu cinema,గోపీచంద్,గోపీచంద్ సాయం,కరోనా నేపథ్యంలో గోపీచంద్ ఆర్ధిక సాయం,వెయ్యి కుటుంబాలకు చేయూత
    గోపీచంద్ ఆర్ధిక సాయం (Twitter/Photo)


    తాజాగా గోపీచంద్ తెలుగు సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 10 లక్షల విరాళం అందజేసారు. ఈ రకంగా గోపీచంద్ తన వంతుగా పేదలకు సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Covid-19, Gopichand, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు