పంతం సినిమా తర్వాత మరోసారి గోపిచంద్, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
పంతం సినిమా తర్వాత మరోసారి గోపిచంద్, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర చాణక్య సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా విజువల్స్ అయితే మరో స్థాయిలో ఉన్నాయి. ఇండో పాక్ బోర్డర్‌లోనే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు తిరు.
చాణక్య ఫైల్ ఫోటో (Source: Twitter)
తమిళంలో ఈయన విశాల్ హీరోగా వచ్చిన వేటాడు వెంటాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గోపీచంద్ ఇమేజ్‌కు సరిపోయేలా స్పై థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడేం చేసాడు అనేది అసలు కథ. ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని గోపీచంద్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కలలు కంటున్నాడు. లడక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీవ్రంగా గాయపడ్డాడు గోపీ. పంతం తర్వాత మరోసారి ఇందులో మెహ్రీన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు గోపీచంద్.
ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తుండటం విశేషం. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిజీ అవుతున్నాడు ఈయన. ఆ మధ్య యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. గోపిచంద్‌కు యాక్సిడెంట్ అవడంతో ఇప్పటికే రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 'చాణక్య' షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు విడుదల చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కూడా ఇందులో నటిస్తుంది. మరి ఈ చాణక్యతో గోపీచంద్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.