‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని గోపిచంద్.. గతేడాది చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. అందుకే ఈ సారి హిట్టు కొట్టాలనే కసితో తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ‘చాణక్య’ అనే ‘స్పై’ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ మధ్యలో గోపిచంద్ యాక్సిడెంట్ వలన షూటింగ్ కాస్తంత ఆలస్యం అయింది. ‘పంతం’ సినిమా తర్వాత మరోసారి ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటైంది. మిగిలిన పాటలను విదేశాల్లో చిత్రీకరించే ప్లాన్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు చాణక్యుడిలా దేశాన్ని ఏ రకంగా రక్షించాడనేదే ఈ సినిమా స్టోరీలా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కవ భాగం భారత్, పాకిస్థాన్ బార్డర్లో షూట్ చేసారు. ఈ సినిమాను అనిల్ సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.