Home /News /movies /

GOPICHAND B GOPAL AARADUGULA BULLET MOVIE READY TO RELEASE HERE ARE THE DETAILS TA

Gopichand: గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకు మోక్షం.. త్వరలో విడుదల..

గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’(Twitter/Photo)

గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’(Twitter/Photo)

Gopichand: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ కలయికలో వచ్చిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. తాాజాగా ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగినట్టు నిర్మాత తాండ్ర రమేష్ వెల్లడించారు.

ఇంకా చదవండి ...
    Gopichand: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ కలయికలో వచ్చిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. అపుడెపుడో నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మధ్యలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. గోపీచంద్ సరసన సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకు అడుగడున ఏదో ఒక అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.

    తాజాగా గోపీచంద్, నయతతార నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగినపోయినట్టు ఈ చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ వెల్లడించారు. ఈ సినిమా విడుదలకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ కూడా తొలిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణ, ఏపీలో థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ముందగా ఈ సినిమానునిర్మాత తాండ్ర రమేష్ సొంతంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కూడా.

    ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)
    ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)


    అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేసినా  కుదర్లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది.అప్పట్లో నిర్మాత పివిపి 9 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనాలని చూసినా కూడా కుదరలేదు. మరోవైపు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోపే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు సమాచారం.

    గోపీ చంద్ ఆరడుగుల బుల్లెట్ (Twitter/Photo)


    ఇప్పటికే  జీ వాళ్లకు ఈ సినిమాను రూ. 8 కోట్లకు శాటిలైట్, డిజిటల్ అమ్మినట్లు తెలుస్తుంది.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. మొత్తంగా నాలుగేళ్లుగా లాబులో ఉండిపోయిన ఈ సినిమా థియేటర్స్‌లో ఎలాంటి ఫలితం రాబుడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aaradugula Bullet, B.Gopal, Gopichand, Nayanthara, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు