GOPICHAND B GOPAL AARADUGULA BULLET MOVIE READY TO RELEASE AFTER SUCCESS OF SEETIMAARR MOVIE HERE ARE THE DETAILS TA
Gopichand: ఈ సారైన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో పేలుతుందా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’(Twitter/Photo)
Gopichand: గోపీచంద్ హీరోగా నటించిన ‘సీటీమార్’ సక్సెస్‌తో ఎపుడు విడుదల కావాల్సిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ను సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డేనే బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించింది. కలెక్షన్స్ కూడా ఓ రేంజ్లో కూత పెట్టేలా పరుగులు పెడుతున్నాయి. ‘సీటీమార్’తో గోపీచంద్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెట్టారు.‘సీటీమార్’ సక్సెస్‌తో ఎపుడు థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాను తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్ట్ చేసారు. మాస్ కాంబినేషన్లో తెరకెక్కిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.
అపుడెపుడో నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మధ్యలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. గోపీచంద్ సరసన సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ నయనతార హీరోయిన్గా నటించింది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకు అడుగడున ఏదో ఒక అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.
తాజాగా గోపీచంద్, నయతతార నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగినపోయినట్టు ఈ చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ వెల్లడించారు. ఈ సినిమా విడుదలకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ కూడా తొలిగిపోయినట్టు చెప్పుకొచ్చారు.
అంతేకాదు తెలంగాణ, ఏపీలో థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ముందగా ఈ సినిమానునిర్మాత తాండ్ర రమేష్ సొంతంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కూడా. తాజాగా ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి అన్ని ఏర్నాట్లు పూర్తైయినట్టు సమాచారం. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు.
ఆరడుగుల బుల్లెట్ సినిమా పోస్టర్ (aaradugula bullet movie)
అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేసినా కుదర్లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది.అప్పట్లో నిర్మాత పివిపి రూ. 9 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనాలని చూసినా కూడా కుదరలేదు. మరోవైపు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోపే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఇప్పటికే జీ వాళ్లకు ఈ సినిమాను రూ. 8 కోట్లకు శాటిలైట్, డిజిటల్ అమ్మినట్లు తెలుస్తుంది.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. మొత్తంగా నాలుగేళ్లుగా లాబులో ఉండిపోయిన ఈ సినిమా థియేటర్స్‌లో సీటీమార్ లాంటి ఫలితం ‘ఆరడుగుల బుల్లెట్’ రాబడుతుందో లేదో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.