Home /News /movies /

GOPICHAND B GOPAL AARADUGULA BULLET 4 DAYS BOX OFFICE COLLECTIONS HERE ARE THE DETAILS TA

Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ (Gopichand in Aaradugula Bullet Photo : Twitter)

గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ (Gopichand in Aaradugula Bullet Photo : Twitter)

Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎపుడో నాలుగేళ్ల క్రితం  విడుదల కావాల్సిన మూవీ ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా  ఈ దసరా కానుకగా విడులైంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎపుడో నాలుగేళ్ల క్రితం  విడుదల కావాల్సిన మూవీ ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా  ఈ దసరా కానుకగా విడులైంది.  గోపీచంద్ హీరోగా నయనతార హీరో, హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్ మరో ముఖ్యపాత్రలో నటించి ఈ నెల 8న విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా ‘కొండపొలం’, ‘డాక్టర్ వరుణ్’ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఇక ఈ  చిత్రాన్ని  యాక్షన్ సినిమాల డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. రీసెంట్‌గా మాచ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది.

    ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు. ఇక ఈ శుక్రవారం విడుదలైన ‘ఆరడుగుల బుల్లెట్’ నాలుగు రోజులు బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..

    చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    ఈ సినిమా తెలంగాణ (నైజాం) లో రూ. 29 లక్షల వసూళ్లను సాధించింది. సీడెడ్ (రాయలసీమ)లో ఈ సినిమా రూ. 18 లక్షల వసూళ్లు చేసింది. ఏపీ అన్ని ఏరియాల్లో కలిపి రూ. 0.57 లక్షలు కలెక్ట్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు కలిపి రూ. 1.04 కలెక్షన్స్ రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపితే.. రూ. 5 లక్షలు మాత్రమే వసూళ్లు రాబట్టడం విస్మయం కలిగిస్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1 కోటి 9 లక్షలు మాత్రమే వసూళు చేసింది.

    Venkatesh Multistarers : అబ్బాయి రానా సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

    మొత్తంగా రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 2 కోట్లు రాబట్టాలి. పరిస్థితులు చూస్తుంటే.. అంత కలెక్ట్ చేయడం కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితి. దసరాకు ‘మహా సముద్రం’ సినిమాతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొత్తంగా గోపీచంద్ కెరీర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’ మరో డిజాస్టర్‌గా నిలిచిపోనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aaradugula Bullet, B.Gopal, Gopichand, Nayanthara, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు