Gopichand Seetimaar Review: గోపీచంద్ రొటీన్ సీటీమార్.. పక్క కమర్షియల్ హిట్

Gopichand Seetimaar Review

Gopichand Seetimaar Review: టాలీవుడ్ హీరో గోపీచంద్ తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆతర్వాత జయం, నిజం వంటి పలు సినిమాలలో విలన్ పాత్రలో నటించగా యజ్ఞం సినిమాతో హీరోగా పరిచయమయ్యడు.

  • Share this:
    Gopichand Seetimaar Review: టాలీవుడ్ హీరో గోపీచంద్ తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆతర్వాత జయం, నిజం వంటి పలు సినిమాలలో విలన్ పాత్రలో నటించగా యజ్ఞం సినిమాతో హీరోగా పరిచయమయ్యడు. కొంతవరకు మంచి సక్సెస్ అందుకోగా 2015 నుంచి అంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

    రివ్యూ: సిటీమార్
    నటీనటులు: గోపీచంద్, తమన్నా, దిగంగన సూర్య వంశీ, భూమిక చావ్లా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి తదితరులు
    సంగీతం: మణి శర్మ
    సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
    దర్శకత్వం: సంపత్ నంది
    నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
    సినిమా విడుదల: సెప్టెంబర్ 10, 2021

    కథ: ఇందులో గోపీచంద్ ఆంధ్ర మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా కార్తీక్ సుబ్రహ్మణ్యం పాత్రలో నటించాడు. ఇక తమన్నా తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ గా జ్వాలా రెడ్డి పాత్రలో నటించింది. ఇందులో అమ్మాయిలు కబడ్డీ ఆడేందుకు తమ కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఒప్పించే ప్రయత్నం చేస్తాడు కార్తీక్ సుబ్రహ్మణ్యం. ఇక కార్తీక్.. జ్వాల రెడ్డితో ప్రేమలో పడటం ఆ తర్వాత నేషనల్ కబడ్డీ పోటీలు వీరిద్దరి జట్లు పోటీకి దిగడం జరుగుతుంది. ఆ సమయంలో వీరిపై ఒక గ్యాంగ్ బెదిరిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వారిని అడ్డుకుంటారు. దీంతో ఆ తర్వాత ఏం జరిగిందో ఆ నేపథ్యంలోనిదే ఈ సినిమా కథ.

    ఇది కుడా చదవండి:గోపీచంద్ తమన్నాల సీటీమార్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

    సినిమా ఎలా ఉందంటే: సంపత్ నంది ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. ఇక ఇందులో మొత్తం కబడ్డీ కోసం కోచ్ గా ప్రతి ఒక్కరి బాధ్యతలు తీసుకోవడం.. గోపీచంద్ తో కథ నడవడం అద్భుతంగా ఉంది. తమన్నా కూడా ఈ కథకు బాగా సెట్ అయింది. ఇంటర్వెల్ సీన్స్ సెకండాఫ్ పై మరింత ఆసక్తి పెంచింది. సెకండాఫ్ లో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కూడా బాగా సింక్ అయింది. మొత్తానికి ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు బాగా ఆసక్తిగా అనిపించింది.

    ఇది కుడా చదవండి:గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీటీమార్ టీమ్..

    నటన: గోపీచంద్ నటన అదిరిపోయింది. కబడ్డీ కోచ్ పాత్రలో బాగా సెట్ అయ్యాడు. మరోవైపు తమన్నా కూడా తన పాత్రలో బాగా లీనమైంది. పైగా తెలంగాణ భాషలో అద్భుతంగా మాట్లాడింది. ఇక తదితర నటులు తమ పాత్రలతో బాగా మెప్పించారు.

    చివరగా ఒక్కమాట: సీటీమార్.. రొటీన్ విజిల్ సౌండ్.. కానీ పక్కా కమర్షియల్..

    రేటింగ్: 2.75/5.0
    Published by:Navya Reddy
    First published: