మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. దానికి సంబందించిన పూజా కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ ఇద్దరూ గతంలో 'గౌతమ్ నంద'కు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై మరో సినిమాకు కలిసి పనిచేయనున్నారు. కాగా ఈ సినిమా గోపిచంద్‌కు 28వ చిత్రంగా వస్తోంది. ఈ రోజు జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి మరో ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా వచ్చి.. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. సినిమాకు సంబందిందించి ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని... అది పూర్తవ్వగానే.. సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని తెలిపింది చిత్ర బృందం.
అది అలా ఉంటే గోపిచంద్ ఇప్పటికే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యంతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గోపిచంద్ తాజాగా.. తిరు దర్శకత్వంలో నటించిన 'చాణక్య' స్పై థ్రిల్లర్ దసరా కానుకగా ఈ అక్టోబర్ 5న విడుదలకు సిద్దం అవుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.