'సీటీమార్' అంటోన్న గోపిచంద్.. ఫస్ట్‌లుక్ విడుదల..

యాక్షన్ స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే.

news18-telugu
Updated: January 27, 2020, 11:55 AM IST
'సీటీమార్' అంటోన్న గోపిచంద్.. ఫస్ట్‌లుక్ విడుదల..
Twitter
  • Share this:
యాక్షన్ స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. 'సీటీమార్' అంటూ ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా .. చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్, రాజమండ్రిలో షెడ్యూల్ పూర్తి చేసుకుందని.. ఈరోజు నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించామని తెలిపారు.First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు