Aaradugula Bullet : 2015 తెరకెక్కించిన 'ఆరడగుల బుల్లెట్' అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షక ఆదరణ పొందలేక పోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. ఆరడగుల బుల్లెట్ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది.
మాచో స్టార్ గోపీచంద్, (Gopichand) తాజాగా స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr) 'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా (Tamannaah ) నటించారు.
అది అలా ఉంటే సీటీమార్’ సక్సెస్‌తో ఎపుడో థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్ట్ చేసారు. నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటించారు.
2015 తెరకెక్కించిన 'ఆరడగుల బుల్లెట్' అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షక ఆదరణ పొందలేక పోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. ఆరడగుల బుల్లెట్ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాను తాండ్ర రమేష్ నిర్మించగా.. బి గోపాల్ దర్శకత్వం వహించారు.
ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా వస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.