• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • GOPICHAND AND MARUTHI FILM PAKKA COMMERCIAL POSTPONED DUE TO CORONA RISE SR

Gopichand : వాయిదా పడిన మాచోస్టార్ గోపీచంద్ పక్కా కమర్షియల్‌ షూటింగ్..

Gopichand : వాయిదా పడిన మాచోస్టార్ గోపీచంద్ పక్కా కమర్షియల్‌ షూటింగ్..

Gopichand Pakka Commercial Photo : Twitter

Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అలా ఉండగానే ఆయన మరో సినిమాను స్టార్ట్ చేశాడు.

  • Share this:
    మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అలా ఉండగానే ఆయన మరో సినిమాను స్టార్ట్ చేశాడు. హిట్ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ప్రతిరోజూ పండగే’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. చాలా వేగంగా సినిమాను చేస్తూ వచ్చారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మారుతి వేగానికి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసింది చిత్రబృందం. కరోనా తాకిడి తగ్గాకనే చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ రోల్ ఆయన మిగితా సినిమాల కన్న భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. హీరోయిన్‌గా రాశీ ఖన్నా చేస్తోంది.

    ఇక గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు. సీటీమార్ పేరుతో వస్తోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ జ్వాలా రెడ్డిగా చేస్తోంది. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది.

    Raashi Khanna will be seen as lawyer for maruti and gopichand pakka commercial,Raashi Khanna bikini, Raashi Khanna news, రాశీ ఖన్నా, raashi khanna age, raashi khanna pics, raashi khanna movies, raashi khanna songs, raashi khanna news, రాశీ ఖన్నా సినిమాలు, రాశీ ఖన్నా వయస్సు, రాశీ ఖన్నా వార్తలు
    Raashi Khanna Photo : Instagram


    మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ రెండున విడుదలకావాలసి ఉండగా.. సీజీ వర్క్ పూర్తవ్వకపోవడంతో వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమాలతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు గోపీచంద్. ‘అలిమేలుమంగ వేంకటరమణ’‌ పేరుతో వస్తోన్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు