Home /News /movies /

GOPICHAND AGAIN TEAM UP WITH DIRECTOR SAMPATH NANDI TA

Gopichand: ఫ్లాప్ దర్శకుడితో మరోసారి జత కట్టిన గోపీచంద్..

గోపీచంద్ ఫైల్ ఫోటో

గోపీచంద్ ఫైల్ ఫోటో

‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. గతేడాది చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా గోపీ చంద్ తనకు యావరేజ్ సక్సెస్ అందించిన దర్శకుడితో మరోసారి జత కడుతున్నాడు.

‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. గతేడాది చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా ఈ యాక్షన్ హీరో తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ సినిమా చేస్తున్నాడు. పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చాణక్యలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో బి.వి.యస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో కొత్త సినిమాకు సైన్ చేసాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే గోపిచంద్..సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా విడుదల చేసారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

సంపత్ నందితో గోపిచంద్ కొత్త మూవీ (Twitter/Photo)


గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి అపుడు సక్సెస్ కొట్టని వీరిద్దరు ఇపుడు ఈ సారైనా హిట్టు అందుకుంటారా లేదా అనేది చూడాలి.

 
First published:

Tags: Gopichand, Sampath Nandi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు