Home /News /movies /

GOPICHAND ACTION SPY THRILLER CHANAKYA MOVIE TEASER RELEASED AND MOVIE SHOT IN INDO PAK BORDER PK

‘చాణక్య’ టీజర్ విడుదల.. ఇండో పాక్ బోర్డర్‌లో గోపీచంద్ సాహసం..

చాణక్య మూవీ పోస్టర్ (Source: Twitter)

చాణక్య మూవీ పోస్టర్ (Source: Twitter)

పంతం సినిమా తర్వాత మరోసారి గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ‘చాణక్య‌’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

పంతం సినిమా తర్వాత మరోసారి గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ‘చాణక్య‌’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర చాణక్య సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు టీజర్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా విజువల్స్ అయితే మరో స్థాయిలో ఉన్నాయి. ఇండో పాక్ బోర్డర్‌లోనే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు తిరు.
Gopichand action Spy Thriller Chanakya movie teaser released and movie shot in indo pak border pk పంతం సినిమా తర్వాత మరోసారి గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ‘చాణక్య‌’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. Gopichand,Gopichand twitter,Gopichand chanakya movie teaser,chanakya movie teaser,chanakya teaser,chanakya movie twitter,Gopichand Mehreen chanakya,Gopichand chanakya,chanakya completed shooting,chanakya teaser releases tomorrow,chanakya teaser,chanakya trailer,chanakya thanthram,chanakya movie release,chanakya movie,chanakya,chanakya thanthram movie teaser,gopichand chanakya movie release update,gopichand chanakya,chanakya thanthram review,chanakya first look,గోపిచంద్, మెహ‌్రీన్ చాణక్య‌,చాణక్య‌ షూటింగ్ పూర్తి,చాణక్య‌ టీజర్,
చాణక్య మూవీ పోస్టర్ (Source: Twitter)

తమిళంలో ఈయన విశాల్ హీరోగా వచ్చిన వేటాడు వెంటాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గోపీచంద్ ఇమేజ్‌కు సరిపోయేలా స్పై థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడేం చేసాడు అనేది అసలు కథ. ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని గోపీచంద్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కలలు కంటున్నాడు. లడక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీవ్రంగా గాయపడ్డాడు గోపీ.

యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. గోపిచంద్‌కు యాక్సిడెంట్ అవడంతో ఇప్పటికే రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 'చాణక్య' షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు విడుదల చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కూడా ఇందులో నటిస్తుంది. మరి ఈ చాణక్యతో గోపీచంద్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
First published:

Tags: Chanakya, Gopichand, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు