హోమ్ /వార్తలు /సినిమా /

Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో ఫట్.. అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్..

Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో ఫట్.. అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్..

గోపీచంద్ ‘ఆరడుగులు బుల్లెట్’ (File/Photo)

గోపీచంద్ ‘ఆరడుగులు బుల్లెట్’ (File/Photo)

Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో ఫట్.. అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా విషయానికొస్తే..

Gopichand - Aaradugula Bullet : Gopichand - Aaradugula Bullet : గోపీచంద్ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోలేదు. అప్పటికే మూడేళ్లు ఆలస్యంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్‌తో ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత నాలుగేళ్ల తర్వాత గత దసరా సందర్భంగా థియేటర్స్‌లో విడుదలైంది. మొత్తంగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో దిగడానికి దాదాపు ఏడేళ్లకు పైగా సమయం పట్టింది. ఇక ఈ  చిత్రాన్ని  యాక్షన్ సినిమాల డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. రీసెంట్‌గా మాచ్ స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది.

ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు. ఇక ‘ఆరడుగుల బుల్లెట్’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. 1 కోటి 63 లక్షలను మాత్రమే రాబట్టింది.

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..


మొత్తంగా రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా రూ. 1.63 కోట్లను రాబట్టింది. మొత్తంగా ఈ సి నిమాను బయ్యర్స్‌కు రూ. 1.5 కోట్ల నష్టాలను మిగిల్చింది.  మరో రూ. 2 కోట్లు రాబట్టాలి.  మొత్తంగా గోపీచంద్ కెరీర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’ మరో డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇక థియేటర్స్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చకుంది.

Samantha : వైట్ టాప్‌లో అదిరిన సమంత లుక్ .. ఫ్యాషన్ వేర్‌లో వావ్ అనిపిస్తోన్న సామ్..

అంతేకాదు 10 రోజులుగా ఈ సినిమా టాప్ 2 లో ట్రెండ్ అవుతుందట. ఇక ఈ సినిమాను నిర్మాతలు రూ. 4.5 కోట్లకు అమెజాన్ ప్రైమ్‌కు అమ్మేసారట. వారం రోజుల్లో వ్యూవర్ షిప్ ఆధారంగా అమెజాన్ వాళ్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందట. మరోవైపు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది హోళి కానుకగా విడుదల కానుంది.

First published:

Tags: Gopichand, Nayanthara, Tollywood