Home /News /movies /

GOPICHAND 1ST BIGGEST BLOCKBUSTER LAKSHYAM MOVIE COMPLETED 14 YEARS PK

Gopichand Lakshyam: గోపీచంద్ ‘లక్ష్యం’ సినిమాకు 14 ఏళ్ళు.. ఎన్ని కోట్ల లాభాలు తెచ్చిందో తెలుసా..?

గోపీచంద్ లక్ష్యం సినిమా (Lakshyam movie)

గోపీచంద్ లక్ష్యం సినిమా (Lakshyam movie)

Gopichand Lakshyam: 2005 సమయంలో యజ్ఞం(Yagnam), రణం(Ranam) లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు గోపీచంద్. అలాంటి సమయంలో గోపీచంద్(Gopichand) మార్కెట్‌ను అమాంతం పెంచేసిన సినిమా లక్ష్యం(Lakshyam). ఈ చిత్రం వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఇంకా చదవండి ...
2005 సమయంలో యజ్ఞం, రణం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు గోపీచంద్. ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సపోర్ట్ లేకుండా కొత్త వాళ్లను నమ్ముకుంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు గోపీచంద్. అలాంటి సమయంలో గోపీచంద్ మార్కెట్‌ను అమాంతం పెంచేసిన సినిమా లక్ష్యం. శ్రీవాస్ అనే కొత్త దర్శకుడితోనే ఈ చిత్రం చేసాడు గోపీ. అన్నాదమ్ముల కథతో లక్ష్యం వచ్చింది. జగపతిబాబు, గోపీచంద్ రియల్ బ్రదర్స్‌లా అదరగొట్టారు. అనుష్క శెట్టి అందాల ఆరబోత సినిమాకు సూపర్ పాజిటివ్‌గా మారింది. బ్రహ్మానందం కామెడీ ప్లస్ అయింది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జులై 5, 2007న విడుదలైన లక్ష్యం నేటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 14 ఏళ్ళ కిందే 14 కోట్ల షేర్ వసూలు చేసింది.
gopichand,gopichand twitter,gopichand instagram,gopichand laksyam movie,gopichand laksyam movie 14 years,gopichand lakshyam movie collections,గోపీచంద్,గోపీచంద్ లక్ష్యం సినిమాకు 14 ఏళ్ళు,గోపీచంద్ లక్ష్యం సినిమా కలెక్షన్స్
గోపీచంద్ లక్ష్యం సినిమా (Lakshyam movie)

నైజాం: 4.95 కోట్లు
సీడెడ్: 1.47 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.54 కోట్లు
ఈస్ట్: 0.85 కోట్లు
వెస్ట్: 0.73 కోట్లు
గుంటూరు: 0.88 కోట్లు
కృష్ణా: 0.94 కోట్లు
నెల్లూరు: 0.47 కోట్లు

ఏపీ + తెలంగాణ మొత్తం: 11.83 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.92 కోట్లు
వరల్డ్ వైడ్: 13.75 కోట్లు
gopichand,gopichand twitter,gopichand instagram,gopichand laksyam movie,gopichand laksyam movie 14 years,gopichand lakshyam movie collections,గోపీచంద్,గోపీచంద్ లక్ష్యం సినిమాకు 14 ఏళ్ళు,గోపీచంద్ లక్ష్యం సినిమా కలెక్షన్స్
గోపీచంద్ లక్ష్యం సినిమా (Lakshyam movie)

లక్ష్యం సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మించాడు. ఈ చిత్ర బిజినెస్ అప్పట్లో 5.4 కోట్ల వరకు జరిగింది. అప్పటికే రణం, యజ్ఞం లాంటి సినిమాలతో ఫామ్‌లో ఉన్న గోపీచంద్.. మొదటి వారంలోనే తన లక్ష్యం అందుకున్నాడు. ఫుల్ రన్‌లో 14 కోట్లు వసూలు చేసి బయ్యర్లకు 8 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది లక్ష్యం సినిమా. లక్ష్యం తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన లౌక్యం కూడా బ్లాక్‌బస్టర్ అయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gopichand, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు