Home /News /movies /

GOPI CHAND NEW MOVIE PAKKA COMMERCIAL WILL STREAMING ON AHA SB

Pakka Commercial: ఓటీటీలోకి గోపిచంద్ కొత్త సినిమా.. ఎక్కడో తెలుసా ?

Pakka commercial Photo : Twitter

Pakka commercial Photo : Twitter

పక్కా కమర్షియల్ సినిమాలో గోపిచంద్‌కు జంటగా హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తోంది. వీరిద్దరూ ఈ సినిమాలో లాయర్లుగా కనిపించనున్నారు.

    గోపిచంద్ (Gopi Chand)కొత్త సినిమా పక్కా కమర్షియల్ (pakka Commercial). మారుతి(Maruthi) దర్శకత్వంలో గోపీచంద్‌ ఈ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక `పక్కా కమర్షియల్‌` చిత్రంలో హీరోయిన్ రాశీఖన్నా(Raashi Khanna). `జిల్‌` తర్వాత గోపీచంద్‌, రాశీఖన్నా కలిసి నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఈ సినిమా టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం మరో విశేషం. `పక్కా కమర్షియల్` టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని జూలై 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    తాజాగా పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా(Aha) మంచి మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్‏ను స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సత్యరాజ్(Satya raj), రావు రమేష్, అనసూయ(Anasuya) కీలకపాత్రలలో నటించారు. పక్కా కమర్షియల్ మూవీ మ్యాచోస్టార్‌ గోపిచంద్ కెరీర్‏లో 29వ చిత్రంగా రాబోతుంది. పక్కా కమర్షియల్ మూవీలో గోపించ్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ (Gopi Chand) చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

    `భలే భలే మగాడివోయ్`, `టాక్సీవాలా`, `ప్రతి రోజు పండగే` లాంటి సినిమాలు చేసిన జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో `పక్కా కమర్షియల్` సినిమా వస్తుంది. ఈ సినిమాలో దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి `భ‌లేభ‌లే మ‌గాడివోయ్`, `ప్ర‌తిరోజు పండ‌గే`వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. `ప్రతి రోజు పండగే` సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా.. గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Gopichand, Maruthi, Pakka Commercial, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు