news18-telugu
Updated: August 2, 2019, 8:18 AM IST
మహేష్ బాబు (పైల్ ఫోటో)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. అదే ఊపులో ఆయన రాజకీయాల్లో ప్రవేశించి సంచలన విజయాలు నమోదు చేసారు. ఆతర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఆయన సత్తా చూపెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సింహాసాన్ని ఓ చక్రవర్తిలా ఏలారు. ఇక చిరంజీవి కూడా ఎన్టీఆర్ తరహాలోనే రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి ఫోకస్‌ను సినిమాలపైనే కేంద్రీకరించారు. ఐతే చిరంజీవి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న దానిపై తాజాగా గూగుల్ మరియు సోషల్ మీడియాలో మహేష్ బాబు నెంబర్ అని తేల్చింది. గూగుల్‌లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ నెంబర్ టూ ప్లేస్‌లో ఉన్నట్టు గూగుల్ పేర్కొంది.

మహేష్,. అల్లు అర్జున్ (పైల్ ఫోటోస్)
ఆ తర్వాత మూడో స్థానంలో రామ్ చరణ్, నాల్గో ప్లేస్‌లో ప్రభాస్.. 5 ప్లేస్‌లో ఎన్టీఆర్ ఉన్నట్టు గూగుల్ తెలిపింది. ఈ వార్త విని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేేసేస్తున్నారు. ఇంకోవైపు గూగుల్‌లో వెతికినంత మాత్రానా వాళ్లే నెంబర్ అని నిర్ధారించలేమన్నారు. మరోవైపు నెట్‌ని సోషల్ మీడియాను ఫాలోకానీ మాస్ ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారని మిగతా హీరోల అభిమానులు అంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 2, 2019, 8:18 AM IST